సంఘాల(పిఎసిఎస్) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
మిర్యాలగూడ మండలంలోని నాలుగు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి తెలిపారు. బుధవారం ఆలగడప పిఎసిఎస్ లో యూరియా నిల్వలను ఆమె తనిఖీ చేశారు.
మిర్యాలగూడ మండలంలోని 4 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్)లో యూరియా అందుబాటులో ఉందని, రైతులు బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి తెలిపారు. బుధవారం ఆలగడప పిఎసిఎస్ లో యూరియా నిల్వలను ఆమె తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు మండలంలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా 27,039 యూరియా బస్తాలు బుక్ అయినట్లు తెలిపారు.
యూరియా బుకింగ్ యాప్ లో మార్పులు జరిగాయని, రెండెకరాల పంటకు సరిపడా యూరియాను ఒకేసారి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రెండూ నుంచి ఐదు ఎకరాలున్న రైతులు రెండు దఫాలుగా, ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులు ముందు 40 శాతం, రెండోసారి 30 శాతం, మూడోసారి 30 శాతం చొప్పున బుక్ చేసుకోవాలని సూచించారు.
మండలంలోని ఆలగడప, అన్నారం, తడకమల్ల, తుంగపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వెంటనే బుక్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈఓ నాగయ్య, సైదులు, ప్రవీణ్, వెంకట్రాములు, సుధాకర్ లు పాల్గొన్నారు.












