ఆదిలాబాద్, జూలై 22
వ్యవసాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని బోథ్ మండల రైతు బంధు మాజీ అధ్యక్షుడు నల్ల జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేస్తారని, ప్రస్తుతం సగటున 50 శాతం వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంలో, విత్తన బ్యాంకులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు గ్రామీణ స్థాయికి చేరడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అరుతడి పంటలను ప్రోత్సహించాలని కోరారు. ఆయా పంటలకు కనీస మద్దతు ధర, పంట బీమా, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే రైతులకు ఉపశమనం లభిస్తుందని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా పరస్పర విమర్శలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు కరువు బారిన పడినట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక కరువు నిధిని వెంటనే ఏర్పాటు చేసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని నల్ల జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.