ఖానాపూర్, 12 July
ెంగాణఖయంైగంచచేసనయాఖయబాధయాాహయనబఆఎసపాటఖానాపూనయోజకగఇంచాజకాదభూకయాజానసననాయకగాండపడడా."ాళనకోసపంటదకంచేఅదేపండంద"అననటగాఖయంసపందంచడంైాంగాననంగాఅానంచడేననఆయనఅననా.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు పంటలకు నీళ్లు ఎలా అందిస్తారని అడిగిన ప్రశ్నకు "వాళ్లను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది" అనే తరహాలో స్పందించడం రైతాంగాన్ని తీవ్రంగా అవమానించడమేనని ఆయన అన్నారు.
"రైతు కష్టంతో పంట పండుతుంది... రక్తంతో కాదు." అన్నం పెట్టే రైతును గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. అలాంటి రైతుల గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సమంజసం కాదని జాన్సన్ నాయక్ అభిప్రాయపడ్డారు.
ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రమని, ఇక్కడ నరకడం, దబాయించడం, బెదిరించడం అనే సంస్కృతి లేదని అన్నారు. ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం పంచే నేల తెలంగాణ అని, రైతు చెమటతో ఈ నేల సస్యశ్యామలం అవుతుంది గానీ, రైతు రక్తంతో కాదని స్పష్టం చేశారు.
రైతుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రతి వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఈ రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పాలనకు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రైతు గౌరవాన్ని కాపాడే వారినే ప్రజలు ఆదరిస్తారని, ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జాన్సన్ నాయక్ అన్నారు.












