హంపొలి(కే) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశాయని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి విమర్శించారు. నిర్మల్–ఆదిలాబాద్ జిల్లాల ఏఐకేఎంఎస్ 11వ మహాసభలు ఆదివారం భైంసా మండలం హంపొలి(కే) గ్రామంలో నిర్వహించారు.
రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశాయని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి విమర్శించారు.
నిర్మల్–ఆదిలాబాద్ జిల్లాల ఏఐకేఎంఎస్ 11వ మహాసభలు ఆదివారం భైంసా మండలం హంపొలి(కే) గ్రామంలో నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కే. సర్దార్ జెండావిష్కరణ చేయగా, సభలకు అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి మహాసభలను ప్రారంభించి మాట్లాడారు.
సాగు ఖర్చులు పెరగడం, పంటలకు గిట్టుబాటు మద్దతు ధరలు లేకపోవడం, రుణభారం అధికమవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు పంటలకు చట్టబద్ధమైన గిట్టుబాటు మద్దతు ధర సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కూలీల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే మార్గమని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి జే. రాజు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరిత, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎల్.ఆర్. ఉపాలి, దీనజీ, బాబు, సాయినాథ్, కేశవ్, గణపతి, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












