బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) నిర్మల్ - ఆదిలాబాద్ జిల్లా 11వ మహాసభ రేపు బైంసా మండలం హంపోలి కె గ్రామంలో జరగనుంది. ఈ మహాసభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజు రైతు కూలీలకు పిలుపునిచ్చారు. పెరుగుతున్న రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) నిర్మల్ - ఆదిలాబాద్ జిల్లా 11వ మహాసభ బైంసా మండలం హంపోలి కె గ్రామంలో రేపు జరగనుంది. ఈ మహాసభను జయప్రదం చేయాలని AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజు రైతు కూలీలకు పిలుపునిచ్చారు.
రైతాంగ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి రైతుల ఆత్మహత్యలు అధికమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని, వీటిని ఎదుర్కోవడానికి రైతు కూలీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో జరిగే ఉమ్మడి జిల్లా మహాసభలో అధిక సంఖ్యలో రైతులు, కూలీలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.












