నిర్మల్, 2026-07-12
జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ఏరియాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారాలు సేకరించి, గడువులోగా ఆన్ లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ఏరియాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్ఓలు తప్పనిసరిగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎస్ఐఆర్ ఫారములను తిరిగి తీసుకుని, గడువులోగా ఆన్ లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగించాలని, ఫారము పూరించుటలో బీఎల్ఓలు సహకారం అందించాలని సూచించారు.
ఈ తనిఖీలో రాజ్యస్వాదికారి, అర్బన్ తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, స్థానిక దంపతుల కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్@రప్పు భాయ్ తదితరులు పాల్గొన్నారు.












