ముధోల్, జులై 12
ముధోల్ మండలంలో నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ చేతుల మీదుగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 4.12 లక్షల రూపాయల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోందని మండల కాంగ్రెస్ నాయకులు పలువురు అన్నారు. ఆదివారం నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ చేతుల మీదుగా మండలం లోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 4,12,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. నిరుపేదలకు అత్యంత అవసరమైన పథకాలను అమలుచేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు పాటు పడుతున్న ప్రభుత్వానికి ప్రజలు వెన్నంటే ఉండాలని కోరారు. ఇట్టి పథకానికి నిధులు అందజేసిన ప్రభుత్వానికి, కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, అష్ట గ్రామ సర్పంచ్ రావుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు పతంగే కిషన్, అజిజ్, మండలం లోని ఆయా గ్రామాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.












