నిర్మల్, జులై 12
నిర్మల్ జిల్లా టిఎన్జీవో భవనంలో ఆదివారం డిజెఎఫ్డబ్ల్యూ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొంపాల విజయ్ కుమార్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత్రికేయుల సంక్షేమం కోసం అందరం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా టిఎన్జీవో భవనంలో ఆదివారం రోజున డిజెఎఫ్ డబ్ల్యూ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా బొంపాల విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా తాటిచెట్ల మధుకర్, ప్రధాన కార్యదర్శిగా పాతర్ల రాజు, కోశాధికారిగా పడిగెల దేవేందర్, కార్యదర్శిగా వి. కృష్ణ, ప్రచార కార్యదర్శిగా డి. భీమేష్ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో డిజెఎఫ్డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యకాంత్ పాల్గొని, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎన్సిఎస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పాత్రికేయుల సంక్షేమం కోసం అందరం కలిసి పని చేయాలని నూతన అధ్యక్షుడు బొంపాల విజయ్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.












