మిర్యాలగూడ, జూలై 12
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆదివారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారం అవుతుందని ఆయన అన్నారు. శ్రీనివాస్ నగర్, మంగళ్ దుబ్బ తండా, కేజేఆర్ కాలనీలకు చెందిన లబ్ధిదారులకు ఆయన ఇళ్లను ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారం అవుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు బొల్లా ఉపేందర్ రెడ్డి, దామరచర్ల మండలం మంగళ్ దుబ్బ తండాకు చెందిన లబ్ధిదారులు భూక్య లక్ష్మీ, తాళ్ళపల్లి లాజర్, కేజేఆర్ కాలనీకి చెందిన లబ్ధిదారులు ధనావత్ కవిత, దానవత్ కమిలి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ రిబ్బన్ కట్ చేసి నూతన గృహాలను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, నూతన గృహాల్లో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.












