ముధోల్, జూలై 12
గూడులేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసిందని ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి అన్నారు. ఆదివారం ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో లంబాడి శ్రీలత సాయినాథ్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రజా పాలనలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళుతుందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
లబ్ధిదారులను మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి, అష్ట సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ శ్రావణి గంగా శేఖర్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ పోషట్టి, నాయకులు లోలం మురళి, సురేష్, నవీన్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.