Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
సారంగాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను తహసిల్దార్ విజయ్ కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బూత్ లెవెల్ అధికారులతో (బిఎల్వోలు) సమావేశమై, ప్రస్తుతం జరుగుతున్న ఓటరు గుర్తింపు ఫారాల సవరణ, పంపిణీపై సమీక్ష నిర్వహించారు.
సారంగాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను తహసిల్దార్ విజయ్ కాంతారావు పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులతో (బిఎల్వోలు) సమావేశమై, ప్రస్తుతం జరుగుతున్న ఓటరు గుర్తింపు ఫారాల సవరణ, పంపిణీపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాల గురించి అవగాహన కల్పించి, వాటిని పూర్తి చేయించి, తిరిగి సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా చూడాలని, ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకునే బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, బిఎల్వోలు, అధికారులు పాల్గొన్నారు.












