ముథోల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ముథోల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.
మండల కేంద్రం ముథోల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రావుల గంగారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పేదలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. రైతు సంక్షేమానికి విశేష కృషి చేసిన రైతు బాంధవుడిగా ఆయన నిలిచారన్నారు. ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వంటి సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అష్ట గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్, వార్డు సభ్యుడు అజీజ్, నాయకులు కిషన్ పాతంగే, గోవింద్ పటేల్, నగేష్, రాజు, లక్ష్మణ్, దిగంబర్, తదితరులు పాల్గొన్నారు.












