కుంటాల, 2026-08-07
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఘనంగా స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలపై మార్గ నిర్దేశనం చేశారు.
కుంటాల, ఆగస్టు 7, మనోరంజని తెలుగు టైమ్స్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భవిష్యత్తుపై మార్గ నిర్దేశనం
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఏత్రాజ్ రాజు మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తు అవకాశాలను, వారు ఎంచుకున్న లక్ష్యాలను సాధనకు కావలసిన మార్గాల గురించి విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేశారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ బృందం అన్ని విధాల తోడ్పడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాగత కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











