భైంసా, 4 September
నేటి బాలలే రేపటి పౌరులు అని ఆశించినా, నేటి విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. డిజిటల్ యుగంలో పిల్లల చేతిలో ఫోన్లు, పబ్జి వంటి ఆటలు వారిని దారి తప్పిస్తున్నాయని, దీనికి తల్లిదండ్రుల పెంపకం కూడా ఒక కారణమని ఒక కళాశాల లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఏడుపు ఆపడానికి ఫోన్లు ఇవ్వడం, వారిని అగౌరవపరిచేలా గురువులను పిల్లల ముందే మందలించడం వంటివి సరైన పద్ధతి కాదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, కానీ నేటి విద్యార్థుల భవిష్యత్తు చూస్తే చాలా భయమేస్తుంది. డిజిటల్ యుగంలో పిల్లల చేతిలో ఫోన్ వస్తే చాలు, పబ్జి గేమ్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. దీనికి తల్లిదండ్రులు కూడా పరోక్షంగా కారణమవుతున్నారు. పిల్లలు ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారని, వారి ఏడుపు ఆపడానికి ఫోన్లు కొనిచ్చి, వాటిలో పాటలు, బొమ్మలు చూపిస్తూ వంట పనులు, ఇతర పనులు చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఫోన్ అలవాటు చేయడం వల్ల, వారు పెద్దయ్యాక కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. పిల్లలు ఏడిస్తే పోనివ్వడం చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. ఇప్పుడు పెద్దయ్యాక ఆ పిల్లలు కూడా అదే చేస్తున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అసలు కారణం తల్లిదండ్రులేనని, పిల్లలు ఫోన్ తీసుకుని ఆడుతున్నారంటే దానికి కారణం వారేనని స్పష్టం చేస్తున్నారు.
మహారాష్ట్రలో ఐఫోన్ కోసం ఓ విద్యార్థి కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను గుర్తు చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా దూకి ప్రాణాలు కోల్పోయారని, కేవలం ఒక ఫోన్ కోసం ఒక కుటుంబం బలి అయిందని, ఫోన్ ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన తెలియజేస్తుందని పేర్కొన్నారు. గురువు కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు శిష్యుడికి న్యాయం చేస్తూనే ఉంటాడని, ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలుసునని తెలిపారు.
మరోవైపు, తమ పిల్లలను గురువు దండిస్తే ఏమాత్రం ఆలోచించకుండా, పాఠశాలకు వెళ్లి, తమ అబ్బాయిని ఎవరు కొట్టారని గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ పిల్లలతోనైనా, వారి మంచి కోసమే గురువులు దండిస్తారని, గురువులను గౌరవించాలని, వారు ఎప్పుడూ మంచి కోరుకుంటారని చెప్పాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తప్పు చేసినప్పుడు దండించబడ్డారని, గురువులు కూడా విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి దండిస్తారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. తప్పు అందరూ చేస్తారని, కానీ అది తప్పని చెప్పి, దండించేవారే గురువు అని, తల్లిదండ్రుల తర్వాత క్రమశిక్షణతో పాటు విద్య, బుద్ధులు నేర్పేది గురువేనని, అలాంటి వారిపై ఫిర్యాదు చేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మూడో స్థానంలో గురువును పెట్టారని, భారతీయ సంస్కృతిలో గురువుకు దైవంతో సమానమైన స్థానం ఉందని గుర్తు చేశారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువులపై నిందలు వేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. తమ పిల్లలకు గురువు గురించి తల్లిదండ్రులు ఎప్పుడైనా చెప్పారా అని, అంత సమయం లేదని, కానీ తమ కొడుకును గురువు దండించాడని చెప్పిన వెంటనే, ఏమాత్రం ఆలోచించకుండా పిల్లల ముందే గురువును మందలించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గురువు తప్పు చేసినప్పుడు నిలదీయడం తప్పులేదని, కానీ పిల్లల ముందు కాదని, గురువు చేసేది పిల్లల మంచి కోసమేనని, అది తల్లిదండ్రులకు కూడా తెలుసునని పేర్కొన్నారు.











