హైదరాబాద్, 3 September
జీవో 97 రద్దు చేయాలని జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్న పాలిటెక్నిక్ విద్యార్థుల పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ కోరారు. ఈ మేరకు ఆయన సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.
పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా వేయాలి హైదరాబాద్, సెప్టెంబరు 3: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, డీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎరవెల్లి జగన్ కోరారు. ఈ మేరకు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ (ఎస్బీటీఈటీ) రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్యను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎరవెల్లి జగన్ మాట్లాడుతూ.. జీవో 97 రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. అలాగే ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు హాజరు శాతం విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మాట్లాడి అటెండెన్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు విశాల్, సందీప్, భవానీశంకర్, నరేష్ నాయక్, సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.











