జి.జి. కళాశాల, నిజామాబాద్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
నిజామాబాద్ నగరంలోని జి.జి. కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు డా.కె. రంజిత (కామర్స్), డా. పి. రామకృష్ణ (భౌతిక శాస్త్రం) 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల విద్య కమిషనర్ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
*జి.జి. కళాశాల అధ్యాపకులు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపిక* ***************** నిజామాబాద్: తెలంగాణ కళాశాల విద్య కమిషనర్ గురువారం వెల్లడించిన ఉత్తర్వుల్లో 2026-27 విద్యాసంవత్సరం *తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులు* గా జి.జి. కళాశాల అధ్యాపకులు *డా.కె. రంజిత (కామర్స్),* *డా. పి. రామకృష్ణ (భౌతిక శాస్త్రం)* ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రంగరత్నం, టీయూ ఈసి మెంబర్ దండుస్వామి, భరత్ రాజ్, వినయ కుమార్, ఏవో రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయ్ భాస్కర్, అభినందనలు తెలిపారు. వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.











