న్యూఢిల్లీ, జూలై 28
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలవడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, రాష్ట్ర మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక అంశాలపై ఈ భేటీ జరిగింది.
తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, రాష్ట్ర మౌలిక వసతుల విస్తరణ అంశాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మంగళవారం న్యూఢిల్లీలో కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయడం, ఐటీ రంగ విస్తరణకు కేంద్ర సహకారం అందించడం, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దివకొండ దామోదర్ రావు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రితో జరిగిన చర్చ వివరాలను ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాకు వెల్లడించారు.











