నిర్మల్, 6 September
రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష సమావేశం జరిగింది
బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు , బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో లేవనెత్తాల్సిన, చర్చించాల్సిన ప్రజా సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గత 1,000 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేసిన మోసాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని నిర్ణయించారు. 22-A భూముల బాధితుల సమస్య, పెండింగ్లో ఉన్న Fee Reimbursement బకాయిలు, ఇతర కీలక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. తెలంగాణ ప్రజల తరఫున అసెంబ్లీలో బీజేపీ బలంగా పోరాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో జవాబుదారీగా నిలబెడుతుంది.












