బాసర లో అధ్వానంగా పారిశుధ్య పరిస్థితులు తాగునీటిలోకి మురుగునీరు కలిసే ప్రమాదం: డా. కిరణ్ , కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని వివిధ వీధుల్లో నాయకులు పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. డా. కిరణ్ కొమ్రేవార్ నాయకత్వంలో, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్యామ్ కొర్వా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి నల్లాల చుట్టూ మురుగు కాలువలు, డ్రైనేజీ నీరు నిల్వ ఉండటాన్ని నాయకులు పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు తాగునీటి నల్లాల వద్దకు చేరడంతో కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని డా. కిరణ్ కొమ్రేవార్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారినప్పటికీ గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా దిగజారిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. లో డ్రైనేజీ వ్యవస్థను వెంటనే సరిచేసి, మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, తాగునీటి నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని డా. కిరణ్ కొమ్రేవార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాసర లో అధ్వానంగా పారిశుధ్య పరిస్థితులు
Share:

సారాంశం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ నిరసన - ప్రజా సమస్యలపై నాయకుల పరిశీలన
ముఖ్య విషయాలు
- కిరణ్ , కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని వివిధ వీధుల్లో నాయకులు పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు.
- బాసర లో అధ్వానంగా పారిశుధ్య పరిస్థితులు తాగునీటిలోకి మురుగునీరు కలిసే ప్రమాదం: డా.
- కిరణ్ కొమ్రేవార్ నాయకత్వంలో, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్యామ్ కొర్వా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి నల్లాల చుట్టూ మురుగు కాలువలు, డ్రైనేజీ నీరు నిల్వ ఉండటాన్ని నాయకులు పరిశీలించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3324ఆర్టికల్స్
4,17,370వ్యూస్










