కామారెడ్డి జిల్లా సదాశివనగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
తల్లిదండ్రులు లేని అనాథ బాలబాలికలకు అండగా నిలుస్తూ, వారికి విద్యనందించేందుకు యూత్ ఫర్ సేవ, ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) సంయుక్తంగా ముందుకు వచ్చాయి. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని మర్కల్, ధర్మారావు పేట్ గ్రామాలకు చెందిన అనాథ విద్యార్థులకు బుధవారం విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
తల్లిదండ్రులు లేని అనాథ బాలబాలికలకు అండగా నిలుస్తూ, వారికి విద్యనందించేందుకు యూత్ ఫర్ సేవ, ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) సంయుక్తంగా ముందుకు వచ్చాయి. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని మర్కల్, ధర్మారావు పేట్ గ్రామాలకు చెందిన అనాథ విద్యార్థులకు బుధవారం విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, జ్యామెట్రీ బాక్స్‌లు, డ్రాయింగ్ బుక్స్ వంటివి అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన, అనాథ చిన్నారులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యను కొనసాగించేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మర్కల్ సర్పంచ్ ప్రియాంక సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు. గ్రామ పాఠశాల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించిన యూత్ ఫర్ సేవ, సామాజిక సమరసత వేదిక, ఐ.ఎస్.ఆర్.డి సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మారావు పేట్ సర్పంచ్ షేక్ ఉమర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో సమాజం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. సేవా సంస్థలు, దాతలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. "సమాజం మనకేమిచ్చిందనే దానికంటే, సమాజానికి మనం ఏమి చేయగలమన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి" అని అన్నారు. విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని దాని కోసం కష్టపడి సాధించాలన్నారు.
మండల విద్యాధికారి యూసెఫ్ మాట్లాడుతూ అవసరం గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులకు ఉపయోగం అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారావు పేట్ సర్పంచ్ షేక్ ఉమర్, మండల విద్యాధికారి యూసెఫ్, మర్కల్ సర్పంచ్ ప్రియాంక సుభాష్ రెడ్డి, ఉపసర్పంచ్ గుర్రపు లింగం, యూత్ ఫర్ సేవ ప్రతినిధులు, సామాజిక సమరసత వేదిక సభ్యులు, ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) ప్రతినిధులు సోలంకి రవళి, అమృత రాజేంధర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు దయానంద్, సౌమ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి గోదావరి, గ్రామ పెద్దలు ఆంజనేయులు, పంచాయతీ పాలక వర్గ సభ్యులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.












