బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
మండల కేంద్రంలోని వాసవి స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు సురేష్ వైద్య హాజరై గురుపౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి గంగయ్య కూడా విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
మండల కేంద్రంలోని వాసవి స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు సురేష్ వైద్య విచ్చేసి గురుపౌర్ణమి విశిష్టతను గురించి వివరించారు.
గురుఃబ్రహ్మ గురుఃవిష్ణు గురుదేవో మహేశ్వరా అనే శ్లోకానికి అర్థం వివరిస్తూ, అజ్ఞానం నుండి జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్లేవారు గురువు అని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి గంగయ్య గురువు గురించి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
తదనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన గురువును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











