బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ గురువుల ప్రాముఖ్యతను, వేద వ్యాస మహర్షి జన్మదినోత్సవాన్ని విద్యార్థులకు వివరించారు.
బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ విద్యార్థులకు గురుపౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు.
గురువులు, జీవితంలో సరైన మార్గాన్ని చూపి జ్ఞానాన్ని అందిస్తారని, హిందూ గ్రంధాల ప్రకారం ముఖ్యమైన గురువులలో ఒకరైన మహర్షి వేద వ్యాస జన్మదినోత్సవాన్ని కూడా ఈ రోజున జరుపుకుంటారని ఆయన తెలిపారు. గురువు మార్గదర్శకత్వం లేకుండా మన చుట్టూ ఉన్న చీకటిని, అజ్ఞానాన్ని నిర్మూలించడం కష్టమని ఆయన విద్యార్థులకు తెలియజేశారు.
గురు పౌర్ణమి అనేది గురువులను, ఉపాధ్యాయులను గౌరవించడానికి అంకితం చేయబడిన రోజు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












