బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
బైంసాలోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హాస్టల్ వార్డెన్లను ఆదేశించారు. బుధవారం ఆయన నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యార్థుల సమస్యలు, వసతి గృహాల పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.
సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. బుధవారం బైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో హాస్టల్ వార్డెన్లతో ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఒక్కో వసతి గృహ అధికారిని సంప్రదించి, హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. హాస్టల్ భవనాల పరిస్థితి, ఇతర సమస్యలపై కూడా ఆయన ఆరా తీశారు.
ఈ సమావేశంలో ఏ.ఎస్.డబ్ల్యూ. ఓ.డి. లత తో పాటు పలువురు వార్డెన్లు పాల్గొన్నారు.












