శాంతినికేతన్ విద్యాలయంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించిన చిన్నారులు , సెప్టెంబరు 3 ( మండల కేంద్రంలోని శాంతినికేతన్ విద్యాలయంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వేషధారణ పోటీలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా వివిధ వేషధారణల్లో అలరించారు. విద్యార్థుల నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు చిన్నారుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శాంతినికేతన్ విద్యాలయంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
Share:

సారాంశం
శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించిన చిన్నారులు
ముఖ్య విషయాలు
- శాంతినికేతన్ విద్యాలయంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించిన చిన్నారులు , సెప్టెంబరు 3 ( మండల కేంద్రంలోని శాంతినికేతన్ విద్యాలయంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వేషధారణ పోటీలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
- చిన్నారులు శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా వివిధ వేషధారణల్లో అలరించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3229ఆర్టికల్స్
3,97,815వ్యూస్










