గురుకుల పాఠశాల, కమ్మదనం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
కమ్మదనం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని అశ్విని అనుమానాస్పద మృతిపై సీఐడీతో సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు.
*అశ్విని మృతిపై సీఐడీ విచారణ చేపట్టాలి* *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్* కమ్మదనం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని అశ్విని మృతి ఘటనపై సీఐడీతో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కమ్మదనం గురుకుల పాఠశాలను సందర్శించి, అశ్విని మృతి ఘటనకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్ శారద, సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అశ్విని ఆత్మహత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ చేపట్టి, సమగ్ర దర్యాప్తు ద్వారా వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులపై ఒత్తిడి, గురుకులాల్లోని పరిస్థితులు తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలిస్తే ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అశ్విని మృతి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులెవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.. KP












