SR Digi School, Nirmal, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
నిర్మల్లోని ఎస్ఆర్ డిజి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో పాల్గొని అందరినీ అలరించారు. పాఠశాల ప్రాంగణం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఎస్ఆర్ డిజి పాఠశాలలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు నిర్మల్, సెప్టెంబర్ 3 ( నిర్మల్లోని ఎస్ఆర్ డిజి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించారు. పాఠశాల ప్రాంగణంలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. విద్యార్థులు శ్రీకృష్ణుడి జీవిత విశేషాలను తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు పాల్గొని వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను చిన్నారులకు తెలియజేయడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.












