నిర్మల్, 8 July
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు, పుస్తకాల దోపిడీని అరికట్టాలని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, పాఠశాలలు పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతూ, బిల్లులు ఇవ్వకుండా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు, పుస్తకాల దోపిడీని అరికట్టాలని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలు పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒక్కో క్లాసుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నా, కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తెలిపారు.
నిర్మల్ జిల్లాలోని అనేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమకు అనుకూలంగా ఉన్న పుస్తకాల షాపుల్లోనే పుస్తకాలను పెట్టి, ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి అమ్ముతున్నాయని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
విద్యా చట్టం ప్రకారం, పేద విద్యార్థులకు 20 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రైవేటు పాఠశాలలు వాటిని ఇవ్వకుండా దోపిడీకి పాల్పడుతున్నాయని గోవింద నాయక్ విమర్శించారు.
ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.












