నిర్మల్, జూలై 7
నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని ముద్రిత, దృశ్య మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ పిల్లల విద్య కోసం అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటూ, ఫీజుల్లో రాయితీ కల్పించాలని గతంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి జారీ చేసిన ఉత్తర్వులతో జర్నలిస్టు కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించనుంది. ఈ సందర్భంగా సానుకూల నిర్ణయం తీసుకున్న జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్నకు జిల్లాలోని మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.












