Lakshadweep, 29 July
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు తన గురువు దండు జనార్దన్ కు గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో తనను గుర్తించేలా చేయడంలో, విద్యాబుద్ధులు నేర్పడంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన తన గురువుకు ఆయన తన నివాసంలో అంజలి ఘటించారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు తన గురువు దండు జనార్దన్ కు గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో తనను గుర్తించేలా చేయడంలో, విద్యాబుద్ధులు నేర్పడంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన తన గురువుకు తన నివాసంలో ఆయన అంజలి ఘటించారు.
అనంతరం, కొండన్నగూడ గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు తమ రాజకీయ గురువు అయిన బక్కని నరసింహులు గారిని గురు పౌర్ణమి సందర్భంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించి ఆశీర్వాదం అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంపీడీవో దండు శరత్ చంద్రబాబు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ అన్మారి వెంకటయ్య, టీడీపీ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, ఒగ్గు కిషోర్, డాక్టర్ వెంకటరమణ, పత్రికా విలేఖరి బాల రాజేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.












