గణేష్‌నగర్, బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 05
బైంసా పట్టణంలోని గణేష్‌నగర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు తోట రాము ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు : బైంసా పట్టణంలోని గణేష్‌నగర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తోట రాము ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో సంఘం కార్యవర్గ సభ్యులు, గల్లీ పెద్దలు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం భజనలు, కోలాటం కార్యక్రమాలతో భక్తులు సందడి చేశారు. శ్రీకృష్ణుడి నామస్మరణతో గణేష్‌నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.












