Miryalaguda, Miryalaguda, Nalgonda, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
మిర్యాలగూడ పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మిర్యాలగూడలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 👉 హాజరైనమాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలునిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోమిర్యాలగూడలో యాదవ సంఘ భవన నిర్మాణం కోసం రూ.15 లక్షల నిధులను మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. యాదవ సంఘం అభివృద్ధి, సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు.ఈ వేడుకల్లో మట్టపల్లి సైదయ్య యాదవ్, చిర్ర మల్లయ్య యాదవ్, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, జడ రాములు, దారం మల్లేష్ యాదవ్,ఎర్రయ్య ,జంగా లక్ష్మణ్, కంచుగట్ల లింగయ్య, పగిడి రామలింగయ్య యాదవ్, చేగుండి మురళి యాదవ్, యాదవ సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు, మహిళలు, యువత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












