నిర్మల్, గురువారం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేల్పూర్ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో గురువారం కమిటీ సభ్యులు, శిష్యులు ఘనంగా పల్లకి సేవను నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య భజన పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేల్పూర్ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో గురువారం కమిటీ సభ్యులు, శిష్యులు ఘనంగా పల్లకి సేవను నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య భజన పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆశ్రమ ప్రాంగణంలోని ఆలయాలు, ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు.
"తారక నామమే మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా" అంటూ భజన పాటలు పాడుతూ, సుమంగళి మహిళలు పల్లకి ముందు మంగళహారతులతో పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ, సప్తభజన, గురు పౌర్ణమి వేడుకల విజయవంతానికి కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారం మరువరానిదని అన్నారు.
పల్లకి సేవలో కమిటీ సభ్యులు కూశన్న గారి నరసయ్య, ఇరుపాజి దామోదర్ గౌడ్, నోముల గంగారెడ్డి, గడ్డం మల్లేష్, సాయిరాం బాల్రాజ్, కుంట సువర్ణ, దమ్మాయి లక్ష్మీ, కొరెం నర్సాగౌడ్, తబలా వాద్య కళాకారుడు సాగర్, గోవింద గిరి స్వామి శిష్య బృందం, భక్తులు పాల్గొన్నారు.












