నిర్మల్, 4 September
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం నిర్మల్ టౌన్ లోని శ్రీ మురళీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రాంరావ్ బాగ్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మురళీకృష్ణ స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి.... శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు శుక్రవారం నిర్మల్ టౌన్ గాంధీ చౌక్‌లోని శ్రీ మురళీకృష్ణ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గారు ప్రత్యేక పూజల్లో పాల్గొని, ఆలయ అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం రాంరావ్ బాగ్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ, శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించినట్లు తెలిపారు. ధర్మాన్ని, సత్యాన్ని, మంచితనాన్ని ఆచరించాలనే సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితంతో ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మేడారం అపరణ ప్రదీప్ కోపషన్ మెంబెర్స్, ధర్మాజీ రాజేందర్ FSCS చైర్మన్, మూడు సు సత్యనారాయణ డిసిసి అధికార ప్రతినిధి, ఆకుల హరీష్ నిర్మల్ టౌన్ అధ్యక్షులు, లక్కాకుల హరీష్ కౌన్సిలర్, రామకృష్ణ మాజీ కౌన్సిలర్, పీవీ రమణ రెడ్డి PACS చైర్మన్, మల్లేష్ యాదవ్ నిర్మల్ మండల్ అధ్యక్షులు, గంగారెడ్డి మాజీ ఆత్మ చైర్మన్, శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్, రమేష్ రెడ్డి మాజీ సర్పంచ్,రవి కిరణ్, వినయ్,భక్తులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.












