రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో, కుబీర్ మండలం లోని జాం గావ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
రైతుల వేదిక భవనంలో ప్రతి రైతుకు ఎకరానికి రూ.6,000 చొప్పున విడతల వారీగా నిధులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం రైతుల ఆర్థిక భద్రతను పెంచుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, యాసంగి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్, బంక బాబు, శివాజీ, సందీప్, గంగరాజు, విలాస్, మల్లన్న, బాబులాల్, షబ్బీర్, సాయినాథ్ పటేల్ వంటి పలువురు నాయకులు పాల్గొన్నారు. రైతులు ఈ నిధుల విడుదలకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.











