రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా సారంగాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా నిధులను విడుదల చేశారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి దశరథ రాజేశ్వర్ తెలిపారు. ఈ నిధుల విడుదలను పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున నిధులు విడుదల చేయడం జరిగిందని, ఈ మొత్తాన్ని విడతల వారీగా రైతు భరోసా పథకం ద్వారా అందజేస్తామని నాయకులు వెల్లడించారు. యాసంగి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతులను వారు ప్రోత్సహించారు.
ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రైతులకు మరింత మేలు చేకూరుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు విలాసరావు, మార్కెట్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, నాయకులు సురేందర్, సత్యం, ఓలా త్రీ నారాయణరెడ్డి, నవీన్ రెడ్డి, వంగ భూమారెడ్డి, దాసరి రమేష్, మైలి రాజేశ్వర్, జాదవ్ ప్రకాష్, రైతులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












