మండలకేంద్రంలోని వింధ్యా పాఠశాల నుండి 18 మంది విద్యార్థులు తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి ప్రవేశానికి అర్హత సాధించారు. వీరు ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీట్లు పొందారు.
వింధ్యా పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్, ప్రిన్సిపల్ కే. నవీన్ కుమార్ లు ఎంపికైన విద్యార్థులకు మెమోటోలను అందజేసి అభినందించారు. విద్యార్థుల అకడమిక్ ప్రగతికి పాఠశాల యాజమాన్యం కృషి చేస్తుందని వారు తెలిపారు.
గురుకులాల్లో ప్రవేశం పొందడం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని, ఇది వారి భవిష్యత్తుకు పునాది వేస్తుందని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది. ఈ విజయం పాఠశాల ఉపాధ్యాయుల నిబద్ధతకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామ్ శ్రీనివాస్, పల్లవి, శ్రీలత, సాయినాథ్, లావణ్య, సుమన్య, మంజుల, రాణి, దివ్య, హారిక మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులందరికీ వారు శుభాకాంక్షలు తెలిపారు.












