నిర్మల్, 2026-07-14
జసగచసఅీఇబబొట.ఇటీసచ,సై,ఆటఅసథ.సగూఆూగొైటీటెచచ,బెటూఆట.
ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మల్ జిల్లాలోని అన్నదాతలు భూముల్లో విత్తనాలు చల్లారు. వరి సాగు చేసేందుకు నార్లు పోసుకున్నారు. అయితే, ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పంటలను, వరినార్లను కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో కొందరు రైతులు వరినారును కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి, చిన్న బకెట్ల ద్వారా వరి నారును తడుపుతూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.











