Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
నిర్మల్ నియోజకవర్గం మామడ మండల కేంద్రంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (అగ్రికల్చర్ గోదాం) భవన నిర్మాణానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ గోదాం నిర్మాణం పూర్తయిన అనంతరం రైతులకు ధాన్యం నిల్వలో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గం మామడ మండల కేంద్రంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ (అగ్రికల్చర్ గోదాం) భవన నిర్మాణానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ గోదాం నిర్మాణం పూర్తయిన అనంతరం రైతులకు ధాన్యం నిల్వలో సౌలభ్యం కలగడంతో పాటు, వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు రంజిత్, ఏలేటి చిన్న లింగారెడ్డి, బాపు రెడ్డి, పందిరి సూరి తదితరులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.












