బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
బైంసా మండలంలోని మహాగాం గ్రామంలో ధాన్యం నిల్వలకు ఇబ్బందులు తొలగించేందుకు గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బుధవారం హైదరాబాదులో ప్రొసీడింగ్ కాపీని అందజేస్తూ వెల్లడించారు.
రైతులు పండించిన ధాన్యం విలువలకు ఇబ్బందులు కలగకుండా బైంసా మండలంలోని మహాగాం గ్రామంలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్ ను (జిల్లా కలెక్టర్ ఉత్తర్వు కాపీని) అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
స్థల గుర్తింపు వివరాలు
విఠలేశ్వర ఆలయం వెనుక ఉన్న 218 సర్వే నంబర్ లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగిందని, ఈ భూమిని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు గోదాముల నిర్మాణం కోసం కేటాయిస్తూ ప్రతిపాదించడం జరిగిందన్నారు.
నిర్మాణ సామర్థ్యం
10 ఎకరాల స్థలంలో పదివేల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న సైంటిఫిక్ గోడౌన్స్ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. స్థలం అప్పగించిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు.
సర్పంచ్ కృతజ్ఞతలు
ఈ సందర్భంగా మహాగాం సర్పంచ్ అప్పల రాజ్యలక్ష్మి రాకేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వేగవంతంగా గోదాముల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.











