తానూర్, జూలై 17
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంబదాస్ సూచించారు. తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, సర్పంచ్ కమలాభాయి బొడ్డోళ్ల బాబన్న అధ్యక్షతన శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి అంబదాస్ సూచించారు. తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, సర్పంచ్ కమలాభాయి బొడ్డోళ్ల బాబన్న అధ్యక్షతన శుక్రవారం రైతులకు ఎల్నినో వాతావరణ మార్పులు, వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబదాస్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా కురిసే అవకాశం ఉందని, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై ఎండల తీవ్రత పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. అందువల్ల రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో పంట కుంటలు నిర్మించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. వర్షాకాలంలో కురిసే ప్రతి చుక్క నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా వర్షాభావ సమయంలో పంటలకు అవసరమైన నీటిని అందించి దిగుబడిని కాపాడుకోవచ్చని వివరించారు.
అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా జొన్న, సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాలతో పాటు పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్యాల సాగు ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకుడు జాదవ్ ధన్సింగ్, వార్డు సభ్యుడు బొడ్డోళ్ల శంకర్, గ్రామ రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.












