ఖానాపూర్, జూలై 26
నచ్చన్ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పెత్తర్పు గ్రామంలో చాలా కాలంగా నెలకొన్న తక్కువ వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
నచ్చన్ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పెత్తర్పు గ్రామంలో చాలా కాలంగా నెలకొన్న తక్కువ వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న తక్కువ వోల్టేజ్ సమస్యను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి నూతన ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించారని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా తక్కువ వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న, పెత్తర్పు గ్రామ ప్రజలు తమ గ్రామంలోని తక్కువ వోల్టేజ్ సమస్యను పరిష్కరించి నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు, విద్యుత్ శాఖ సహాయ ఇంజినీర్ రామ్‌సింగ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం వెంకటేష్, ఉప సర్పంచ్‌లు జాడి లక్ష్మి, ఆనంద్, కాంట్రాక్టర్ రాజు నాయక్, ఎఫ్ఏ కమలాకర్, లక్ష్మణ్, శేఖర్, గంగన్న, రాజలింగు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.












