Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భూసేకరణకు ₹2,278.14 కోట్లు మంజూరు చేయడాన్ని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ అభినందించారు. ఈ నిధుల మంజూరుతో జిల్లా అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, విమానాశ్రయం భూసేకరణ కోసం ₹2,278.14 కోట్లను మంజూరు చేయడం పట్ల నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తోందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు విమానాశ్రయం ఏర్పాటు కావడం వల్ల జిల్లా అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన విమానాశ్రయం నిర్మాణానికి కీలకమైన భూసేకరణ కోసం భారీ నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున సాక్ పెళ్లి సురేందర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆయన అన్నారు.












