మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కన్నెపల్లి, పాలమూరు ఎత్తిపోతల పథకాల మోటార్లు ప్రారంభించాలని, రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు నీరివ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లు వెంటనే ఆన్ చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కన్నెపల్లి మోటార్లను స్టార్ట్ చేయాలని, పాలమూరు ఎత్తిపోతల మోటార్లను మొదలు పెట్టాలని ఆయన కోరారు. రాజకీయాలు మాని రైతాంగానికి సాగునీరు అందించాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు తాబేదారుగా మారారని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సమైక్యవాది అని, ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని నిరంజన్ రెడ్డి విమర్శించారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రజల ఆకలి, ఆకాంక్షల మీద సోయి లేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నుండి మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని, ఎత్తిపోతల పథకాల కింద ఉన్న అన్ని చెరువులు, కుంటలు నింపాలని ఆయన కోరారు. ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పై నుండి వస్తున్న వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టాలని సూచించారు.
ఈ సర్కారుకు ఆ సోయి ఉందన్న దాఖలాలు కనిపించడం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతాంగం కన్నెర్ర చేస్తుందని హెచ్చరించారు. కుంటి సాకులతో రైతుల పొలాలు ఎండబెట్టొద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు.












