Hyderabad/Shaikpet (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
జిల్లేడు చౌదరిగూడ మండల తెలంగాణ మలిదశ ముఖ్య ఉద్యమకారుల సమావేశం చౌదరిగూడ మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పద్మారం వెంకటేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రమేష్ నాయక్ ఎన్నికయ్యారు.
జిల్లేడు చౌదరిగూడ మండల తెలంగాణ మలిదశ ముఖ్య ఉద్యమకారుల సమావేశం చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి టీయూజేఏసీ షాద్‌నగర్ అధ్యక్షుడు టీజీ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, వారి కుటుంబాల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు న్యాయం చేయడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలని కోరారు.
అనంతరం జిల్లేడు చౌదరిగూడ మండల తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పద్మారం వెంకటేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా వీరన్నపేట్ సలీం, ఇంద్రనగర్ శేఖర్, పద్మారం రాములు, ప్రధాన కార్యదర్శిగా రమేష్ నాయక్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా లచ్చంపేట్ బాలరాజు, కే. నర్సింలు, రావిరాల్ జహంగీర్, జిల్లేటి నవీన్, పద్మారం నరేష్ గౌడ్, గోర్ల బాలయ్య, వనంపల్లి రవి, హరిశ్చంద్ర రెడ్డి, సలహాదారులుగా మాజీ సర్పంచ్ శివ, కోనేరు శ్రీనివాస్, అమృతం, దామోదర్, గౌరవ అధ్యక్షుడిగా ఘనపూర్ సాయిలు యాదవ్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తామని, ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.











