పేదలకు ఇందిరమ్మ ఇళ్లను తక్షణమే మంజూరు చేయాలని మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ కార్యాలయంలో ఇందిరమ్మ అధికారి పి.డి. విజయ్ పాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఆత్మకూరు, బొల్లారం, జలాల్పూర్, జక్తి జాంకంపల్లి గ్రామాల్లో అనేక మంది పేదలు ఇప్పటికీ గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారని మనోహర్ రెడ్డి తెలిపారు.
అర్హులైన పేద కుటుంబాలకు ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన మంజూరు చేసి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని ఆయన అధికారులను కోరారు.
పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.












