నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శివాజీ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆలూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి, స్వయం సహాయక బృందం వర్క్ షెడ్ నిర్మాణానికి, కామన్ కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలకు రూ. 10 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 5 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు.
అనంతరం, శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ హైందవ ధర్మ పరిరక్షణకు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈర్ల చిన్నయ్య, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, రాజేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, నాయకులు భోజన్న, విజయ్, పతని నర్సయ్య, శివకర్, చాణక్య, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


