బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా, భూసేకరణ కోసం రూ.2,278.14 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిర్ణయంపై బోథ్ మండల కాంగ్రెస్ కన్వీనర్ మేరుగు భోజన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల మంజూరుతో జిల్లా అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానాశ్రయం భూసేకరణ కోసం రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయడాన్ని బోథ్ మండల కాంగ్రెస్ కన్వీనర్ మేరుగు భోజన్న హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కావడం వల్ల జిల్లా అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు.
జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన విమానాశ్రయం నిర్మాణానికి కీలకమైన భూసేకరణ కోసం భారీగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున మేరుగు భోజన్న హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆయన అన్నారు.











