తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బోధన్‌లో బీఆర్ఎస్ పార్టీ శాంతియుత ధర్నా నిర్వహించింది. అయితే, పోలీసులు ఈ ధర్నాను అడ్డుకుని, నాయకులను అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అవమానకరమైన విధంగా సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తాలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్, బీఆర్ఎస్ బోధన్ టౌన్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్‌లు పార్టీ కార్యకర్తలతో కలిసి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేపట్టారు. అయితే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే పోలీసులు ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకుని, బలవంతంగా చెదరగొట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్తో పాటు టౌన్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్‌లను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై దాడేనని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. శాంతియుత నిరసనలకూ అడ్డుకట్ట వేస్తూ పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు.
ఈ ఘటనపై నిజాంబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, బోధన్ మున్సిపల్ ఇన్చార్జ్ దాదన్నగారి విఠల్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ప్రజలు ప్రశ్నిస్తే, అరెస్టులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.


