హైదరాబాద్, 2026-06-05
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అర్హులైన నిరుపేదలకు 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
పంపిణీ వివరాలు
ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. అర్హులైన నిరుపేదలకు 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న సంగారెడ్డిలో రాష్ట్రవ్యాప్త ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.
ప్రభుత్వ నిర్ణయం
పేదల ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డును తప్పకుండా అందిస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.












