కామారెడ్డి, ఈ నెల 27
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో సదాశివ నగర్ మండల్, మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. అండర్-20, అండర్-18 విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి అభినందించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 27న జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో సదాశివ నగర్ మండల్, మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు తమ సత్తా చాటారు. అండర్-20, అండర్-18 విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి అభినందనలు తెలిపారు.
పోటీల్లో భాగంగా జావెలిన్ త్రో మహిళల విభాగంలో ఎం. అమృత గోల్డ్ మెడల్ సాధించారు. అండర్-20 విభాగంలో బి. నవ్య గోల్డ్ మెడల్, అండర్-18 విభాగంలో కే. స్వప్న సిల్వర్ మెడల్, ఎం. మహేశ్వరి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, అధ్యాపక బృందం విద్యార్థినులను అభినందించారు.












